తమిళనాట చరిత్ర సృష్టించిన దళపతి విజయ్ ఇప్పుడు సినిమాలు వదిలేసి. సీఎం అయ్యిన సంగతి తెలిసిందే. మరి విజయ్ సీఎం కావడంతో అక్కడ అభిమానులు ముఖ్యంగా విజయ్ తో వర్క్ చేసిన దర్శకుల ఆనందానికి అవధులు లేవు.
ఇలా ఒకో ప్రముఖులు ఇప్పుడు సీఎం విజయ్ ని కలుస్తుండగా లేటెస్ట్ గా విజయ్ సినీ కెరీర్ లో మరీ ముఖ్యంగా భారీ ఫాలోయింగ్ సొంతం కావడానికి ప్రధాన కారణం అయ్యిన దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కలిసిన ఫోటో ఇపుడు మంచి మూమెంట్ గా ఫ్యాన్స్ లో మారింది.
దళపతి విజయ్ తో తుపాకీ, సర్కార్ అనే సెన్సేషనల్ హిట్స్ అందించిన మురుగదాస్ పోస్ట్ చేసిన పిక్ వైరల్ గా మారింది. తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ ని కలవడం ఎంతో గర్వకారణంగా ఉందని ఇద్దరు కలిసి దిగిన ఫోటో షేర్ చేసి మురుగదాస్ పోస్ట్ చేశారు. దీనితో ఈ పిక్ ఫ్యాన్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Honoured to meet the Hon’ble Chief Minister of Tamil Nadu,
Thiru C. Joseph Vijay.🏛️❤️ pic.twitter.com/HWstPRTRT9— A.R.Murugadoss (@ARMurugadoss) May 23, 2026


