ఫోటో మూమెంట్: బాలయ్యకి స్పెషల్ విషెస్ తెలిపిన NBK 111 టీం!

ఫోటో మూమెంట్: బాలయ్యకి స్పెషల్ విషెస్ తెలిపిన NBK 111 టీం!

Published on Jun 10, 2026 2:02 PM IST

నేడు నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు తన పుట్టినరోజును ఆఫ్ లైన్, ఆన్లైన్ రెండిట్లో జరుపుకుంటున్నారు. దీనితో పాటుగా బాలయ్య కెరీర్ 111 వ సినిమా అప్డేట్ కూడా నేడు సాయంత్రం రివీల్ కానుండగా ఈ సినిమా మేకర్స్ ఇచ్చే ట్రీట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే బాలయ్యతో దర్శకుడు గోపీచంద్ మలినేని మరియు లేటెస్ట్ బాల బస్టర్ ‘పెద్ది’ నిర్మాత వెంకట సతీష్ కిలారు వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీరి టీం ఇపుడు బాలయ్యని ప్రత్యేకంగా కలిసి తమ స్పెషల్ విషెస్ ని బాలయ్యకి అందించారు.

దర్శకుడు అలానే నిర్మాతలు బాలయ్యకి పుష్పగుచ్ఛాన్ని అందజేసి అందరూ హ్యాపీ ఫేసెస్ లో కనిపిస్తున్నారు. అలానే ఈ సాయంత్రం జరగనున్న విధ్వంసం కోసం అంతా సిద్ధంగా ఉండాలని సినిమా ట్రీట్ కోసం అలర్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు