పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రమే ది రాజా సాబ్. చాలా కాలం తర్వాత తన నుంచి వస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ ఇది కాగా అభిమానులు మంచి హైప్ ని ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటించిన సంగతి తెలిసిందే. రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ అలాగే మరో బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.
ఇక ఈ నలుగురు కలయికలో వచ్చిన సాంగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. మరి వీరిలో నిధి అగర్వాల్ ఒక క్యూట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రభాస్ (Prabhas) తో కలిసి దిగిన పిక్ ని షేర్ చేసి బ్యూటిఫుల్ ఫోటో మూమెంట్ గా దీనిని మార్చుకుంది. మరి ఇందులో ఇద్దరూ కొరియన్ లవ్ సింబల్ ని తమ వేళ్ళతో చూపిస్తూ కనిపిస్తుండగా ఇది ఏమాత్రం ఏఐ పిక్ కాదు అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఈ క్యూట్ పిక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.
This is not AI #TheRajaSaab ???? pic.twitter.com/4a7EFhnYZ4
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) January 4, 2026


