ఫోటో మూమెంట్: మెహర్, వినాయక్ లతో డార్లింగ్ కల్మషం లేని చిరునవ్వు

Prabhas 1

ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి సరైన ఉదాహరణగా మన తెలుగు సినిమా నుంచి డార్లింగ్ హీరో ప్రభాస్ ని చూపించవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో భారీ మార్కెట్ అండ్ స్టార్డం, ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ వసూళ్లు ఉన్న హీరో, ఇతర దేశాల్లో కూడా మంచి ఫేమ్ ఇన్ని ఉన్నప్పటికీ ఆ అహం అనేది మచ్చుకైనా తనలో కనిపించదు. ఎవరితో అయినా అదే కల్మషం లేని చిరునవ్వు ఆదరణ కనిపిస్తుంది.

ఇప్పుడు అలాంటి ఓ పిక్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనతో వర్క్ చేసిన దర్శకుడు మెహర్ రమేష్ అలాగే వి వి వినాయక్ లతో ప్రభాస్ కలిసి కనిపించిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరితో కలిసి ప్రభాస్ ఇందులో ఎంతో ఆప్యాయంగా కనిపిస్తున్నాడు. దీనితో అసలు ఎలా ఇంత సింపుల్ గా ఉండడం సాధ్యపడుతుంది అని అభిమానుల్లో ఎప్పటికీ ఒక ప్రశ్న అయితే అది ప్రభాస్ గొప్పతనం అని చెప్పుకోవాలి. ఇక ప్రభాస్ ఇప్పుడు హను, సందీప్ రెడ్డి వంగల భారీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు.

Exit mobile version