ఫోటో మూమెంట్ : “ప్రాజెక్ట్ కే” సెట్స్ లో లెజెండరీ డైరెక్టర్ తో ప్రభాస్.!

ఫోటో మూమెంట్ : “ప్రాజెక్ట్ కే” సెట్స్ లో లెజెండరీ డైరెక్టర్ తో ప్రభాస్.!

Published on Dec 9, 2022 6:14 PM IST

తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ కి తీసుకెళ్లిన హీరో ప్రభాస్ కాగా నెక్స్ట్ పాన్ వరల్డ్ లెవెల్లో కూడా తీసుకెళ్లేందుకు ఇప్పుడు భారీ చిత్రం “ప్రాజెక్ట్ కే” తో అయితే తాను సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తుండగా ఆల్రెడీ ఈ చిత్రం 60 శాతం మేర షూటింగ్ దగ్గరకి వచ్చేసింది.

ఇక ఈ చిత్రానికి గాను దర్శకత్వ పర్యవేక్షణలో కానీ అలాగే దర్శకుడు నాగశ్విన్ కి సూచనలు ఇవ్వడంలో గాని ఇండియన్ సినిమా లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు కూడా భాగం అయ్యిన సంగతి తెలిసిందే. మరి వారి ఇన్ పుట్స్ తో అయితే అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా..

లేటెస్ట్ గా అయితే ఈ దిగ్గజం తో ప్రభాస్ కలిసిన ఓ బ్యూటిఫుల్ స్నాప్ ఇప్పుడు బయటకి వచ్చింది. మరి ఇద్దరు పక్కపక్కనే కూర్చోగా ప్రభాస్ రెండు చేతులు కట్టుకొని చిన్న పిల్లాడిలా గౌరవంతో కనిపిస్తున్నాడు. దీనితో ఈ పిక్ నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుండగా ప్రాజెక్ట్ కే ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు