ఒక స్టార్ హీరో సినిమా ముహూర్తానికి మరో స్టార్ హీరో వచ్చి క్లాప్ కొట్టడం అనేది చాలా కాలంగా ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సూపర్ స్టార్ రజినీకాంత్ క్లాప్ కొట్టిన అరుదైన ఫోటోని మీ కందిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రాధిక, అమల హీరోయిన్స్ గా నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమా 07 – 08-1989లో ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తానికి ముఖ్య అతిధిగా హాజరైన రజినీకాంత్ మొదటి షాట్ ని క్లాప్ ని ఇచ్చారు. స్కంధా ఆర్ట్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990 నవంబర్ 14న విడుదలైంది. ఇలా రెండు ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్స్ ఒక చోట కలిసిన ఈ అరుదైన ఫోటో మీ కోసం..
