ఫోటో మూమెంట్ : బాబాయ్‌తో అబ్బాయ్ సెల్ఫీ!

ఫోటో మూమెంట్ : బాబాయ్‌తో అబ్బాయ్ సెల్ఫీ!

Published on May 7, 2015 8:21 PM IST

rana-venkat
తెలుగు సినీ పరిశ్రమలో ఒకే కుటుంబానికి చెందిన స్టార్లు చాలా మందే ఉన్నారు. అభిమానులకు తాము ఎంతగానో ఇష్టపడే హీరో అదే కుటుంబంలోని మరో హీరోతో కలిసి నటిస్తే చూడాలని ముచ్చటగా ఉంటుంది. అలాంటి మంచి కాంబినేషన్లలో ఒకటి రానా-వెంకటేష్‌లది. బాబాయ్-అబ్బాయ్‌లైనా ఈ ఇద్దరూ బయట చాలా క్యాజివల్‌గా కలిసి ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది.

ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందనే దానికి సాంపిల్‌గా ఈ ఫోటోను చెప్పుకోవచ్చు. రానా ఓ చిన్న వెకేషన్‌లో తన సెల్ఫీ స్టిక్‌తో ఫోటో దిగుతున్న సమయంలో వెనుక వెంకటేష్ ఫ్రేమ్‌లోకి వచ్చారు. కరెక్ట్‌గా సెట్ చేసి రానా ఈ ఫోటోను క్లిక్‌మనిపించారు. ఈ ఫోటోను రానా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో “బాబాయ్‌తో కలిసి సెల్ఫీ స్టిక్‌ను టెస్ట్ చేస్తున్నా” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఇద్దరినీ ఇలా ఒకే ఫోటోలో చూడడం ముచ్చటగా ఉంది కదూ!?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు