ఫోటో మూమెంట్: KGF షూట్ మధ్యలో భార్యతో రాకీభాయ్ చిల్

ఫోటో మూమెంట్: KGF షూట్ మధ్యలో భార్యతో రాకీభాయ్ చిల్

Published on Apr 14, 2025 8:02 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం కేజీఎఫ్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ చాప్టర్ 2 వచ్చి నేటితో మూడేళ్లు కూడా అయ్యింది. ఇక మూడో పార్ట్ కోసం కూడా ఇచ్చిన హింట్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రం షూటింగ్ గ్యాప్ లో రాకీభాయ్ గెటప్ లో యష్ తో కొన్ని ఫన్ మూమెంట్స్ తన భార్య రాధికా పండిట్ షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది.

మరి చిల్ మోడ్ లో ఉన్నట్టుగా ఇందులో కనిపిస్తుండగా మళ్ళీ పాత జ్ఞాపకాలతో వెనక్కి వెళ్లాం అంటూ తాను పోస్ట్ చేశారు. దీంతో కేజీఎఫ్ 2 మూడేళ్లు అయ్యిన మూమెంట్ లో ఇది మరింత స్పెషల్ గా అభిమానుల్లో మారింది. ఇలా ఈ స్పెషల్ పిక్ ఇపుడు వైరల్ గా కూడా మారింది. ఇక ప్రస్తుతం రాకీభాయ్ “టాక్సిక్” అనే భారీ సినిమాలో బిజీగా ఉండగా ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 19న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు