ఫోటో మూమెంట్ : ‘బాహుబలి’ టీమ్‌తో తమిళ స్టార్ సెల్ఫీ!

ఫోటో మూమెంట్ : ‘బాహుబలి’ టీమ్‌తో తమిళ స్టార్ సెల్ఫీ!

Published on Jun 7, 2015 7:04 PM IST

bbahubali
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ జూన్ 1నే విడుదలైన విషయం తెలిసిందే! ముంబైలోని ఓ ఈవెంట్‌లో బాహుబలి టీమ్, హిందీ పంపిణీదారుడు కరణ్ జోహర్‌లు పాల్గొని హిందీ, తెలుగు ట్రైలర్‌లను లాంచ్ చేయగా, తమిళ ట్రైలర్‌ను చెన్నైలో జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేశారు.

తమిళ ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్య, బాహుబలి తమిళ వర్షన్ కోసం తమిళ నాట తానే స్వయంగా ప్రచారం నిర్వహిస్తానని చెప్పినట్టుగానే బాహుబలి ట్రైలర్ లాంచ్‌కు విచ్చేశారు. బాహుబలి సినిమాను ప్రమోట్ చేయడం తన బాధ్యతని, గర్వంగా కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ట్రైలర్ లాంచ్ తర్వాత బాహుబలి టీమ్‌తో సూర్య ఇలా ఓ సెల్ఫీకి పోజిచ్చారు. తన సినిమా కాకపోయినా సూర్య ఇష్టంతో బాహుబలిని ప్రమోట్ చేయడం సినీ పరిశ్రమలో విశేషంగా కనిపిస్తోంది. తమిళంలో బాహుబలిని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ విడుదల సంస్థలు విడుదల చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు