100కి పైగా సినిమాలు చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సెట్లో తప్ప బయట ఎక్కడా మాట్లాడరు. అలాంటిది ఆయన మొదటి సారి తన గళం విప్పి తన అనుభవాలను. దర్శకత్వ మెలకువలను సినీ ఇండస్ట్రీలోని వారికి చెప్పడం కోసం చేస్తున్న షో ‘సౌందర్య లహరి’. ఈ షోకి ప్రతి వారం ఎవరో ఒక ఇద్దరు సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు. తాజాగా ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా, నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ హాజరయ్యారు. అప్పుడు ఈ ఈ నలుగురు కలిసి దిగిన ఫోటో మీ కోసం. వీరందరూ కలిసి చేసిన షో త్వరలో ప్రసారం కానుంది.
