పిక్ టాక్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి కేక పుట్టిస్తున్న మెగాస్టార్

పిక్ టాక్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి కేక పుట్టిస్తున్న మెగాస్టార్

Published on Dec 19, 2025 3:02 PM IST

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు” కోసం అందరికీ తెలిసిందే. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇక వరుస అప్డేట్స్ ఒకొకటిగా రానున్నాయి. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ నుంచి వచ్చిన లేటెస్ట్ క్లిక్స్ మాత్రం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇస్తున్నాయి.

ఈ సినిమాలో మెగాస్టార్ ప్రిపేర్ చేసిన ఫ్రెష్ లుక్ లో ఎవర్ ఛార్మింగ్ అండ్ తన వింటేజ్ మార్క్ ని చూపిస్తూ ఎనర్జటిక్ గా తాను కనిపిస్తున్నారు. దీనితో ఈ లుక్స్ చూసి మాత్రం మెగా అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ ని విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాలో వెంకీ మామ కూడా నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు