పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బ్రేక్ ఇచ్చి ఫుల్ టైం లోనే రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇపుడు ఏపీ నుంచి తెలంగాణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో మరోసారి పవన్ కోసం నైజాం మార్కెట్ లో డిస్కషన్ మొదలైంది. దీనితో పాటుగా పవన్ తమ ఫ్యామిలీ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాకి తన బెస్ట్ విషెస్ కూడా అందించారు.
ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ భార్య అనా లెజినోవా కొణిదెల సోషల్ మీడియాలో ఎంటర్ అయినప్పుడు నుంచి ప్రతీ రోజు ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. అలా తాను లేటెస్ట్ గా షేర్ చేసిన ఓ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ వైరల్ గా మారింది. పవన్ తో తీసుకున్న ఓ సెల్ఫీ అలానే తన అత్తయ్య, పవన్ తల్లి అంజనా దేవి లతో కలిసి దిగిన ఫోటోలు తన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక దీనితో ఈ పిక్స్ చూసిన అభిమానులు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు.


