ఆగష్టులో విడుదలకానున్న రవిబాబు సినిమా !

ఆగష్టులో విడుదలకానున్న రవిబాబు సినిమా !

Published on Jul 3, 2018 9:00 AM IST

ravi babu

టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన దర్శకుడిగా రవిబాబుకి మంచి పేరు ఉంది. ప్రస్తుతం ‘అదుగో’ అనే చిత్రాన్ని రవిబాబు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మీద మంచి ఆసక్తి ఉంది. పైగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని మొదట ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవటం వల్ల విడుదల వాయిదా పడింది.

ఆగష్టు రెండో వారంలో ‘అదుగో’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందట. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు