‘పిల్లా నువ్వులేని జీవితం’ 4 రోజుల నైజాం కలెక్షన్స్ రిపోర్ట్

‘పిల్లా నువ్వులేని జీవితం’ 4 రోజుల నైజాం కలెక్షన్స్ రిపోర్ట్

Published on Nov 18, 2014 5:12 PM IST

Pilla-Nuvvu-Leni-Jeevitham
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ అనే పాజిటివ్ టాక్ రావడంతో అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ బాగున్నాయి. కేవలం వీకెండ్ లోనే కాకుండా వీక్ డే అయిన సోమవారం కూడా 80% కలక్షన్స్ తో సక్సెఫుల్ గా రన్ అవుతోంది.

మాకు అందిన డిస్ట్రిబ్యూటర్స్ సమాచారం ప్రకారం శుక్రవారం నుంచి సోమవారం వరకూ అనగా నాలుగు రోజుల్లో ఒక్క నైజాంలోనే 2.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మొదటి వారంలో ఈజీగా 3 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకంగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడానికి సినిమా బాగుండడంతో పాటు, మెగా ఫ్యామిలీ హీరో అనే బ్రాండ్ కూడా బాగా ఉపయోగపడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నటీనటుల పెర్ఫార్మన్స్ తో పాటు కంటిన్యూగా కామెడీతో ప్రేక్షకులను నవ్వించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ – రెజీన జంటగా నటించిన ఈ సినిమాకి ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు