పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ‘పిల్లా నువ్వులేని జీవితం’

పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ‘పిల్లా నువ్వులేని జీవితం’

Published on Apr 14, 2014 3:00 PM IST

Pilla-Nuvvu-Leni-Jeevitham
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ బాలన్స్ ఉన్న ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ పార్ట్ చివరి దశకి చేరుకోగా, ఇటీవలే జగపతి బాబు కూడా ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియోని ఈ నెలాఖరులో రిలీజ్ చేసి మే లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు