వైజాగ్ లో పిల్లా నువ్వు లేని జీవితం సక్సెస్ మీట్

వైజాగ్ లో పిల్లా నువ్వు లేని జీవితం సక్సెస్ మీట్

Published on Nov 21, 2014 8:25 AM IST

Pilla Nuvvu Leni Jeevitham (2)
మెగా కుటుంబం నుండి ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో హీరోగా పరిచయమైన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ‘యజ్ఞం’తో సినీరంగానికి దర్శకుడిగా పరిచయమైన రవికుమార్ చౌదరి ఆ తరువార ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’, ‘వీరభద్ర’ సినిమాలతో ఫ్లాపుల రుచి చూసినా ఇప్పుడు మళ్లీ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. మెగా హీరోలు అంటేనే డాన్స్ లకు పెట్టింది పేరు. అలాగే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ డ్యాన్స్ లు ఇరగదీసాడు. నటన, లుక్స్ పరంగా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి తప్పక మెరుగుపరుచుకుంటాడని ప్రముఖులనుండి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ సినిమా చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. దీనితో చిత్రయూనిట్ సంతోషంతో ఉన్నారు. అలాగే నిన్న ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు చిత్రయూనిట్ విజయయాత్రను ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రయూనిట్ తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు హనమకొండ లలో థియేటర్ ల వద్ద సందడి చేయనున్నారు. ఈ టూర్ లో చిత్రయూనిట్ అందరూ పాల్గొనున్నారు. ఇప్పుడు నవంబర్ 22న వైజాగ్ కి చెందిన గురజాడ కళా క్షేత్రంలో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రెజిన హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, హర్షిత్ కలిసి నిర్మించగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు