మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఆడియో అక్టోబర్ 18న జరగాల్సి ఉంది. అయితే విశాఖలో హుధూద్ తుఫాన్ సృష్టించిన ప్రళయం ప్రజలను కష్టాలలోకి నెట్టేసింది. ఈ పరిస్థితులలో ఆడియో విడుదల చేయడం సమంజసం కాదని భావించిన చిత్రబృందం ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 25న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, అల్లు అరవింద్ లతో పాటు మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ హాజరుకానున్నారు.
సాయి ధరమ్ తేజ్ సరసన రెజినా కాసాండ్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ‘యజ్ఞం’ ఫేం ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. అల్లు అరవింద్, దిల్ రాజు సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు.


