నవంబర్ 1న రానున్న ‘పిజ్జా 2’ !

Published on Oct 26, 2020 1:39 pm IST

ఇప్పుడు ఓటిటి రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే ఉన్నాయి కానీ ఈ ఏడాది లాక్ డౌన్ మూలాన ఒక్కసారిగా భారీ మార్పులు వచ్చాయి. అలాగే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్ట్రీమింగ్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలా మన తెలుగులో వచ్చిన మొదటి యాప్ “ఆహా”. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు దీనిని పరిచయం చేసారు. ఇక ఇటీవలే మరో స్ట్రీమింగ్ యాప్ తెలుగులో ఎంటర్ కానుంది.

“ఫిలిం” అనే ఈ డిజిటల్ కంటెంట్ స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు రిలీజ్ కు సంసిద్ధం అయింది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా గాయత్రీ హీరోయిన్ గా నటించిన “పిజ్జా 2” చిత్రం డిజిటల్ ప్రీమియర్స్ తో ఈ యాప్ మార్కెట్ లోకి నవంబర్ 1వ తేదీన లాంచ్ కావడానికి రెడీగా ఉంది. పిజ్జా 2ను కూడా నవంబర్ 1 నుండి ఈ యాప్ లో చూడొచ్చు. మరి ఈ యాప్ లో ఇంకా మరిన్ని విశేషాలు దాగి ఉన్నాయో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఈ పిజ్జా 2 చిత్రానికి రంజిత్ జేయకోడి దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More