రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘పిజ్జా 2’ ట్రైలర్ రిలీజ్..!

Published on Aug 31, 2021 8:35 pm IST

విజయ్ సేతుపతి హీరోగా, గాయత్రి, మహిమ నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా ‘పురియత పుథిర్‌’. ఈ తమిళ చిత్రం అక్కడ ఘన విజయం నమోదు చేసుకుంది. అయితే వివిధ భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్ని ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ తెలుగులో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘పురియత పుథిర్‌’ సినిమాను కూడా ‘పిజ్జా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీ నుండి ఆహా వీడియోలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆహా తాజాగా నేడు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. అయితే ట్రైలర్‌ను చూస్తుంటే ఆద్యంతం ఉత్కంఠగా అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సామ్‌ సి.ఎస్‌ సంగీతం అందిస్తుండగా, దినేశ్‌ కృష్ణన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :