పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘గోపాల గోపాల’ జనవరి 10న రిలీజ్ అయ్యి అభిమానులకి మూడు రోజుల ముందే సంక్రాంతిని తీసుకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకి అన్ని చోట్ల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ లో వచ్చే బైక్ సీన్ కి థియేటర్స్ లో దద్దరిల్లిపోయే రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది ఫాన్స్ థియేటర్ లో తన సెల్ ఫోన్స్ లో రికార్డ్ చేసుకున్న వీడియో యు ట్యూబ్ మరియు వాట్స్ అప్ అనే సోషల్ నెట్వర్క్ లో సందడి చేస్తోంది.
విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. పవన్ – వెంకీ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి మొదటి రోజు అన్ని చోట్ల సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన మూవీగా రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించారు.


