ఇండియాలోనే “ప్లే బ్యాక్” లాంటి స్టోరీ రాలేదంటున్న టీం.!

ఇండియాలోనే “ప్లే బ్యాక్” లాంటి స్టోరీ రాలేదంటున్న టీం.!

Published on Feb 19, 2021 5:20 PM IST


ఏ సినిమాకు అయినా కూడా కథే ప్రధాన బలం దానిని ఎలా తెరకెక్కించారు అన్నది పక్కన పెడితే మొదటగా ఏదైనా సరే కథ కానీ బాగుంటే యూనానిమస్ హిట్ అవుతుంది. సరే ఒకవేళ అది సిల్వర్ స్క్రీన్ పై మొదటి ప్రయత్నంలోనే ఆకట్టుకోకపోయినా తర్వాత తర్వాతకి పెద్ద కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రాలు ఎన్నెన్నో మన తెలుగులోనే ఉన్నాయి.

మరి అలాంటి చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన “1 నేనొక్కడినే” కూడా ఒకటి. అయితే చాలా మందికి ఈ ఇంటెలిజెంట్ స్టోరీ సుకుమార్ దే అని తెలిసి ఉండొచ్చు కానీ ఆ కథను రాసింది మాత్రం హరి ప్రసాద్ జక్కా. మరి అలాంటి మైండ్ బెండింగ్ కథను అందించిన ఈ రచయిత నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే “ప్లే బ్యాక్”.

హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య నాగళ్ల హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం తాలూకా కథ మన ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎప్పుడూ రానిది అని ఖచ్చితంగా ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కథా వస్తువు అవుతుంది అని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటుగా క్రాస్ టైం కనెక్షన్ అనే సరికొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా మేకర్స్ చెప్తున్నారు.

అంతే కాకుండా ఈ కథ మాత్రం ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరు టచ్ చేయనిది అని చాలా నమ్మకంగా చెబుతున్నారు. అది ఎలా ఉంటుందో ఈ మార్చ్ 5న థియేటర్స్ లో చూడాల్సిందే అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించగా అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు