హీరో రాజ్ త‌రుణ్ పై పోలీస్ కేసు న‌మోదు.. మోసం చేశాడంటూ ప్రేయ‌సి ఫిర్యాదు

హీరో రాజ్ త‌రుణ్ పై పోలీస్ కేసు న‌మోదు.. మోసం చేశాడంటూ ప్రేయ‌సి ఫిర్యాదు

Published on Jul 5, 2024 1:12 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ పై నార్సింగి పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదయ్యింది. త‌న‌ను మోసం చేశాడంటూ రాజ్ త‌రుణ్ ప్రేయ‌సి లావ‌ణ్య ఈ కంప్లైంట్ న‌మోదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం.. 11 ఏళ్లుగా రాజ్ త‌రుణ్ ఆమెతో రిలేష‌న్ లో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

అయితే, ఆమెను గుడిలో పెళ్లి కూడా చేసుకున్న రాజ్ త‌రుణ్‌, వేరొక హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని ఇప్పుడు త‌న‌ను మోసం చేశాడంటూ లావ‌ణ్య ఫిర్యాదు చేసింది. మూడు నెల‌ల క్రితం రాజ్ త‌రుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడ‌ని.. అత‌డిని వ‌ద‌లేయ‌క‌పోతే చంపి బాడీ కూడా మాయం చేస్తామ‌ని త‌న‌ను బెదిరిస్తున్న‌ట్లుగా లావ‌ణ్య ఫిర్యాదులో పేర్కొంది.

గ‌తంలో డ్ర‌గ్స్ కేసులో త‌న‌ను కావాల‌నే ఇరికించార‌ని..అరెస్ట్ అయిన తాను 45 రోజులు జైల్లో ఉన్నాన‌ని.. అయినా కూడా రాజ్ త‌రుణ్ త‌న‌కు ఎలాంటి సాయం చేయ‌లేద‌ని లావ‌ణ్య ఫిర్యాదు చేసింది. త‌న‌కు రాజ్ త‌రుణ్ కావాల‌ని, త‌న‌కు న్యాయం చేయాలంటూ లావ‌ణ్య పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు