రజనీకాంత్ గతంలో కావేరీ జలాల విషయంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటకలో ఆయన తాగాజా ‘కాలా’ చిత్రాన్ని విడుదలకానివ్వమని కొందరు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఈ వివాదం పెద్దది అవుతుండటం, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం కలుగజేసుకుంది.
కర్ణాటక హైకోర్టు కూడ చిత్ర విడుదల సాఫీగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సినిమా ఏయే థియేటర్లలో విడుదలవుతుందో ఇవ్వాలని, దాని ప్రకారం విడుదల రోజు జూన్ 7న సినిమా హాళ్ళకు భద్రత కల్పిస్తామని తెలిపారు. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్టే కనిపిస్తున్నాయి.


