రాజకీయాలు అనే ఆప్షనే లేదు – మహేష్ బాబు

14th, April 2018 - 09:53:44 AM

సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. రాజకీయ నైపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. సినిమా ఈ నెల 20న భారీ ఎత్తున విడుదలకానుంది. ఈ సందర్బంగా ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడిన మహేష్ ప్రతి ఒక్కరికీ దేశం పట్ల గౌరవం, మనస్సాక్షి ఉండాలని, ఈ చిత్రం ఆ అంశాలపై వారికి దృష్టి కోణం ఏర్పడేలా చేస్తుందని అన్నారు.

అలాగే సమస్కరణల కోసం రాజకీయాల్లో చేరుతారా అనే ప్రశ్నకు సమాధానంగా రాజకీయాలు తన ఆప్షన్ కాదని, మంచి స్టోరీలు చెప్పడం, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం, కురినప్పుడు సినిమాల ద్వారా సామాజిక సందేశాల్ని ఇవ్వడమే తనకు ఇష్టమని మహేష్ అన్నారు. ఇకపోతే కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.