శృంగార తార పూనం పాండే తెలుగులో తొలిసారిగా నటిస్తున్న చిత్రం ‘మాలిని & కో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో పూనం పాండే హాట్ హాట్ స్టిల్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం విశాఖలో పూనం పాండే మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకేక్కిస్తునారు. ఈ షెడ్యూల్ వారం రోజుల పాటు జరుగుతుంది. తర్వాత షెడ్యూల్ నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో జరపడానికి సన్నాహాలు చేశారు.
‘యమలీల’ సినిమాలో బాల నటుడిగా నటించిన మిలన్ రాఠీ ‘మాలిని & కో’లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సామ్రాట్, కావ్య సింగ్, సాంబ, రవి కాలే ఇతర పాత్రదారులు. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కిషోర్ రాఠీ సమర్పణలో మహేష్ రాఠీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరు.కె దర్శకుడు. జనవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


