ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “పొన్నియిన్ సెల్వన్ 2”.!

Published on Jun 2, 2023 7:00 am IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి సీక్వెల్ అయితే ఈ ఏడాది రిలీజ్ చేయగా అనూహ్యంగా మొదటి పార్ట్ కన్నా దీనికే మంచి టాక్ వచ్చినప్పటికీ అందులో సగం వసూళ్ల దగ్గర మాత్రమే ఈ చిత్రం నిలిచిపోయింది.

ఇక ఈ భారీ సినిమా అయితే ఈ మధ్యనే ఓటీటీ లో రెంటల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి వచ్చింది. కానీ ఇప్పుడు అయితే అమెజాన్ లో ప్రీ స్ట్రీమింగ్ కి అయితే వచ్చేసింది. ప్రైమ్ మెంబర్స్ ఇప్పుడు రెంటల్ గా కాకుండా అన్ని భాషల్లో ఇప్పుడు ఈ సినిమాని నార్మల్ గానే వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :