‘అరవింద’ స్వంతం గా డబ్బింగ్ చెపుతుంది !

Published on Aug 28, 2018 7:59 pm IST


త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ప్రస్తుతం ఈచిత్రం యొక్క డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే తన పాత్రకు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. పూజా ముంబై వాసి కావడంతో ఇన్ని రోజులు ఆమె నటించిన చిత్రాల్లో వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. ఇక ఈ చిత్రం కోసం ఆమె తెలుగు నేర్చుకొని మొదటిసారి డబ్బింగ్ చెప్పడం విశేషం. సినిమాలో తన ఒరిజినల్ వాయిస్ ను వినబోతున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఇక ఈసినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More