పవన్ తో పూజా హెగ్డే.. అప్పుడు కావాలి ఇప్పుడు వద్దు?

పవన్ తో పూజా హెగ్డే.. అప్పుడు కావాలి ఇప్పుడు వద్దు?

Published on Jun 30, 2026 7:04 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా అవైటెడ్ సీక్వెల్ సినిమా ఓజి 2 చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ భారీ హైప్ ఉన్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రోజుకో హాట్ డిస్కషన్ వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం ప్రస్తుతం మొదలైన రూమర్స్ మాత్రం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసినట్టే తెలుస్తోంది. పవన్ సరసన హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది అని మొదలైన టాక్ ఇప్పుడు ఫ్యాన్స్ లో నిరాశగానే మారింది.

గతంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకి ఇదే పూజా హెగ్డే అంటే అంతా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో మారింది. తెలుగులో పూజా హెగ్డే ఫామ్ కోల్పోయింది. పైగా ఆమె చేసిన సినిమాలు ప్లాప్ లు గానే నిలుస్తున్నాయి. వీటితో ఆమె అంటేనే టాలీవుడ్ ఆడియెన్స్, ఫ్యాన్స్ ఆలోచనలో పడుతున్నారు. ప్రస్తుతానికి ఇది టాక్ మాత్రమే కాగా ఎంతవరకు నిజం అవుతుంది అనేది ఆగి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు