మహర్షి కోసం పూజా హెగ్డే అంత తీసుకుందా ?

Published on Feb 3, 2019 3:47 pm IST

‘ఒక లైలా కోసం’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇక ఈ చిత్రం పర్వాలేదనిపించింది కానీ పూజ కెరీర్ కు పెద్దగాఉపయోగపడలేదు. ఈచిత్రం తరువాత ముకుంద అనే చిత్రంలో నటించిన అది కూడా పరాజయం చెందడంతో తరువాత ఆఫర్లు రావడం గగనం అయిపొయింది. అయితే ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.

ఆమె కెరీర్ లో చెప్పొకోదగ్గ విజయం అంటే ‘అరవింద సమేత’ చిత్రమే కానీ జయాపజయాలతో సంభందం లేకుండా భారీ పారితోషికం తీసుకుంటుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఆమె మహేష్ సరసన మహర్షి సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి గాను పూజ కోటి 75 లక్షల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆమె ప్రస్తుతం ఆమె ఈ చిత్రం తో పాటు ప్రభాస్ 20 లో కూడా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :