పూజా ‘దేవి’ అవతారం అదిరిందిగా…!

Published on Aug 26, 2019 3:54 pm IST

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం వాల్మీకి. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ మాస్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన జర్ర జర్రా సాంగ్ లో వరుణ్ ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. 14రీల్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తుండగా, వచ్చే నెల 13న విడుదల కానుంది.

ఐతే నిన్న వాల్మీకి లో ప్రధాన హీరోయిన్ గా చేస్తున్న పూజా లుక్ కి సంబందించిన ఓ పోస్టర్ ని విడుదల చేశారు. లంగా వోణీ, కాళ్ళకు పట్టీలు, రెండు జడలు వేసుకొని సైకిల్ పై కిరాణా సరుకుల కెళుతున్న పూజా లుక్ అదిరిపోయింది. 90ల నాటి పల్లెటూరి అమ్మాయి గెటప్ లో ఆమె కేకగా ఉంది. ఈ చిత్రంలో పూజా పేరు దేవి అని తెలుస్తుంది. వాల్మీకి కి దేవికి మధ్య దర్శకుడు ఎలాంటి రొమాంటిక్ లవ్ ట్రాక్ సెట్ చేశాడో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :