లాక్ డౌన్ లో ఈ ఫుడ్ ని పూజా బాగా మిస్ అవుతుందట.!

Published on May 22, 2020 12:50 am IST

టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని చాలా తక్కువ మంది హీరోయిన్ లకు మాత్రమే దక్కాయి. అలాంటి హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించేసిన ఈ బ్యూటీ ఈ లాక్ డౌన్ ఓ స్పెషల్ ఫుడ్ ఐటెం ను బాగా మిస్ అవుతున్నానని ట్వీట్ చేసారు.

ప్రస్తుతం రంజాన్ మాసంలో ఎంతో ఫేమస్ అయిన ఫుడ్ ఏంటో అందరికీ తెలుసు. అదే హైదరాబాద్ లో దొరికే హలీం ను ఈ లాక్ డౌన్ సమయంలో మిస్సవుతున్నారట. ఈ విషయాన్నే పూజా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వ్యక్తపరిచారు. ప్రస్తుతం పూజా డార్లింగ్ హీరో ప్రభాస్ తో “ఓ డియర్” అనే పాన్ ఇండియన్ చిత్రం అలాగే అక్కినేని అఖిల్ తో “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” అనే సినిమాలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More