స్టార్ హీరో సినిమాలో పూజ హెగ్డే ఫైనల్ అయిందా ?

Published on Jan 20, 2021 3:00 am IST

తెలుగు పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న ఈ భామకు తెలుగునాట క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. ఇలా తెలుగులో వెలిగిపోతూనే తమిళంలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది పూజా. 2012లో ‘ముగమూడి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఆమె ఆ సినిమా అంత కప్ప ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తెలుగుపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.

మళ్లీ 8 ఏళ్ల తర్వాత తమిళంలోకి ప్రవేశించడానికి ఆమెకు అవకాశం దొరికిందట. అది కూడా స్టార్ హీరో విజయ్ సినిమాతో కావడం విశేషం. ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్. ఈయన త్వరలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇందులో కథానాయకిగా పూజా హెగ్డేను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయ్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పుడు అందులో కూడ పూజా హెగ్డే పేరే కథానాయకిగా తెరపైకి వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా నిలిచిపోయినా పూజాకు విజయ్ సినిమాలో నటించే అవకాశం మాత్రం అలాగే ఉందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More