
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని 123తెలుగు.కామ్ కొన్ని రోజుల క్రితం తెలియజేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పూజా హెడ్గేను తీసుకోవాలని నిర్ణయించారు. అధికారికంగా ప్రకటించలేదు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. వ్యంగా అన్ని పనులు జరిగితే త్రివిక్రమ్ సినిమా తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ సన్నిహితుల వర్గాల సమాచారం ప్రకారం.. కొరటాల చెప్పిన కథకు అల్లు అర్జున్ ఓకే చెప్పాడు. మరిన్ని వివరాల కోసం 123తెలుగు.కామ్ సైట్ ను సందర్శిస్తూ ఉండండి.