దేవిశ్రీ తో పెళ్లా… నో ఛాన్స్ అంటున్న యంగ్ హీరోయిన్.

Published on Jun 6, 2019 3:24 pm IST

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన నాలుగు పదుల వయసుకి దగ్గరపడుతున్నా పెళ్లి ఊసెత్తడం లేదు . ఐతే గత కొంతకాలంగా ఆయన ఓ తెలుగు హీరోయిన్ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని ఇండస్ట్రీలో జనాలు చెప్పుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు, “వేర్ ఈస్ వెంకట లక్ష్మీ” మూవీలో హీరోయిన్ గాచేసిన పూజిత పొన్నాడ అని టాక్. ‘రంగస్థలం’ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి కి పరిచయం ఐయ్యిందట. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లిందని సమాచారం.

ఐతే ఈ విషయాన్ని నేరుగా పూజిత నే అడుగగా ఆమె ఇందులో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేసింది. అసలు నేను దేవిశ్రీ ని ‘రంగస్థలం’ మూవీ వంద రోజుల వేడుకలో కలవడం మినహా అంతకు ముందు అతనితో అసలు పరిచయమే లేదు అని చెప్పుకొచ్చింది. ఈమె నటించిన “సెవెన్” మూవీ నేడు విడుదలైంది. దీనిని బట్టి చుస్తే దేవిశ్రీ పెళ్లి ఇప్పట్లో ఐయ్యేలా లేదు.

సంబంధిత సమాచారం :

More