అలాంటి యూట్యూబ్ ఛానల్స్ పై హీరోయిన్ ఫిర్యాదు !

Published on Apr 16, 2019 6:31 pm IST

సోషల్ మీడియాలో రోజు రోజుకు నటీనటులు పై అసత్య ఆరోపణలు, అసభ్యకరమైన పోస్ట్ లు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఎంతమంది ఎన్ని సార్లు తమ పై పూర్తిగా అవాస్తమైన రాతలు మరియు పోస్ట్ లు పెడుతున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ.. అలాంటి పోస్ట్ లు పెట్టే ఆకతాయిలను మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు పుర్తిగా అరికట్టలేకపోతున్నారు.

కాగా తాజాగా మరో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా పలు యూట్యూబ్ చానల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేసే విధంగా కొంతమంది పలు యూట్యూబ్ ఛానల్స్ లో పోస్టింగులు పెడుతున్నారని ఆమె ఆరోపించింది. పూనమ్ కౌర్ దాదాపు ఏభై యూట్యూబ్ చానల్స్ పైన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :