తెలుగులో పూనం పాండే ‘నషా’.

poonam-pandey
ట్విట్టర్ ప్రపంచంలో అర్ధనగ్న (సెమి న్యూడ్) ఫోటోలు, సంచనల వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో ఉండడానికి ప్రయత్నించే భామ ‘పూనం పాండే’. ఇంటర్నెట్లో పూనం పాండేను అభిమానించే వారి సంఖ్య చాలా ఎక్కువే. పూనం పాండే సెక్సీ ఇమేజ్ క్యాష్ చేసుకోవాలని హిందీలో ‘నషా’ అనే సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్’గా పూనం పాండేకు ఇది తోలి సినిమా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘నషా’ ఆశించిన రీతిలో విజయం సాదించలేదు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు.

ఇవిఎన్ చారి అనే నిర్మాత ‘నషా’ సినిమాను తెలుగులో ‘తేరా నషా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ‘తేరా నషా’ సినిమా తెరకెక్కిందని, గ్లామర్ తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలో పూనం పాండే నటించిందని నిర్మాత తెలిపారు. తెలుగులో విజయం సాదిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version