ఈ మాజీ హీరోయిన్ తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందా ?

Published on Aug 7, 2022 12:44 am IST

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం సహాయ నటిగా, అలాగే బుల్లితెరపై కూడా అదరగొడుతుంది. సీమ టపాకాయ్,అవును, అఖండ, దృశ్యం-2 వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన పూర్ణ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. బుల్లితెరపై జడ్జిగా కూడా తనదైన ముద్రను వేసిన పూర్ణ, షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది.

అయితే, షానిద్ ఆసిఫ్ అలీతో పూర్ణ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతుందని అనుకునే లోపే, తాజాగా ఆమె పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. కానీ, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని మరోపక్క టాక్ నడుస్తోంది. పైగా ఇటు పూర్ణ కూడా తన సోషల్‌ మీడియాలో ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను డిలీట్‌ చేయలేదు. కాబట్టి, నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :