తమన్నా తరహాలోనే ధైర్యం చేసిన మరో హీరోయిన్

Published on Sep 26, 2020 3:00 am IST


ఒకప్పటిలా నటీమణులు కేవలం హీరోయిన్ పాత్రలే చేస్తాం, హీరో పక్కన ఆడి పాడతాం, సాఫ్ట్ రోల్స్ టాప్ప వేరేవి చేయం అంటూ కండిషన్లు పెట్టుకోవట్లేదు. పాత్ర బాగుంటే, నటనకు స్కోప్ ఉంటే ఏ పాత్రలోకైనా దూకేస్తాం అంటున్నారు. అది నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర అయినా పర్వాలేదంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు నెగెటివ్ పాత్రలు చేసి మెప్పించగా తాజాగా స్టార్ నటి తమన్నా సైతం నెగెటివ్ రోల్ చేయడానికి సై అన్నారు. నితిన్ చేస్తున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ నందు ఆమే విలన్. ఇప్పుడు ఆమె బాటలోనే మరొక నటి పూర్ణ అడుగులువేస్తోంది.

పూర్ణ తాజాగా లాంఛ్ అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త చిత్రంలో ప్రతినాయకిగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేయనున్నారు. విజయ్ కుమార్ తన కథకు ప్రతినాయకిగా పూర్ణ అయితే బాగుంటుందని ఆమెను అప్రోచ్ అయ్యారట. ఇన్నాళ్లూ హీరోయిన్ పాత్రలే చేస్తూ వచ్చిన పూర్ణ విజయ్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో ధైర్యం చేసి నెగెటివ్ రోల్ చేయడానికి ఒప్పుకుందట. ఆమె పాత్ర సినిమాలో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. కెరీర్ ఆరంభంలో మలయాళ చిత్రాలు చేసిన పూర్ణ తెలుగులో ‘సీమ టపాకాయ్, అవును, రాజుగారి గది’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం :

More