రెండేళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సాదించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అవును’. దర్శకుడు రవిబాబు ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘అవును’లో నటించిన ప్రధాన నటినటులు అందరూ ‘అవును 2’లో కూడా నటిస్తున్నారు. ఆగస్ట్ 1న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది.
హీరోయిన్ పూర్ణ మరో రెండు రోజుల్లో ‘అవును 2’ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతుంది. ఆగస్ట్ 7వ తేది నుండి పూర్ణ ఇతర నటీనటులపై సన్నివేశాలను తెరకేక్కిస్తారు. సింగిల్ షెడ్యూల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు.
ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ‘అవును 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ తరహాలోనే ‘అవును 2’ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


