ఎన్టీఆర్ బయోపిక్ లో పాపులర్ హిందీ నటుడు !

Published on Jun 26, 2018 11:29 am IST

ఎన్టీఆర్ జీవిత కథను దర్శకుడు క్రిష్ తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ నటించడమే కాకుండా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 5 నుంచి షూటింగ్ కి వెళ్లనుంది. మొదటి షెడ్యూల్ ను వరుసగా పదిహేను రోజులు పాటు రామోజీ ఫిలిం సిటీలో, రామకృష్ణ స్టూడియోస్ లో షూట్ చేయనున్నారు. ఇప్పటికే క్రిష్ మొదటి షెడ్యూల్ లోని ముఖ్యమైన పాత్రల కోసం నటీ నటులను ఫైనల్ చేశారు. బసవతారకంగారి పాత్రలో విద్యాబాలన్ రానా నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ హిందీ నటుడు సచిన్ కెడెకర్ ఇందులో ఒక ప్రముఖ పాత్రలో నటించనున్నారు. ఎన్టీఆర్ జీవితంలో నాదండ్ల భాస్కరరావు పాత్ర ముఖ్యమైనది. ఇప్పుడు ఆ పాత్ర కోసమే దర్శకనిర్మాతలు సచిన్ కెడెకర్ ను తీసుకున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాత బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More