‘సింగం-3’ను హిందీలోకి రీమేక్ చేయనున్న పాపులర్ సినిమాటోగ్రాఫర్ !


ఇండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరు రవి కె చంద్రన్. ఈయన ‘అమృత, దిల్ చాహత హై, కలర్స్, ఫనా’ వంటి హిట్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసి ప్రస్తుతం మహేష్ బాబు, కొరటాల శివల కలయికలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ కు కూడా పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈయన దర్శకత్వం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అది కూడా సూర్య నటించిన ‘సింగం 3’ ని హిందీలోకి రీమేక్ చేస్తారట. ఈ రీమేక్లో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తారట. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీ నటులెవరు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రవిచంద్రన్ 2014లో జీవా హీరోగా ‘యాన్’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు.