‘రంగస్థలం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెట్టించిన ఉత్సాహంతో బోయపాటి శ్రీను సినిమాకు సన్నద్ధమవుతున్నారు. ‘రంగస్థలం’ చిత్రంలో పంచెకట్టు, గుబురు గడ్డంతో రఫ్ లుక్లో పల్లెటూరి యువకుడిగా కనబడిన చరణ్ బోయపాటి సినిమాలో మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తారట. ఆ లుక్ కోసం కొంత బరువు కూడ తగ్గాల్సి ఉండటంతో ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు చెర్రీ.
ఇందుకోసం ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఉడియార్ ను పర్సనల్ ట్రైనర్ గా అపాయింట్ చేసుకున్నాడట చిట్టిబాబు. రాకేష్ ఉడియార్ గతంలో ‘దంగల్’ సినిమా కోసం అమీర్ ఖాన్ కు, ‘సుల్తాన్’ సినిమా కోసం ‘సల్మాన్ ఖాన్’ కు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేశాడు. అంతేగాక రామ్ చరణ్ ను ‘ధృవ’ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్లో కనిపించేలా చేసింది కూడ ఈ ట్రైనరే.
డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది.


