నానితో కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్న ప్రముఖ నిర్మాణ సంస్థ !
Published on Jun 14, 2018 3:05 pm IST

‘ప్రేమమ్’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి ‘బాబు బంగారం’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్ లు హీరో హీరోయిన్లుగా ఒక సినిమా, నాగ చైతన్య, మారుతిల కలయికలో ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే సినిమాను నిర్మిస్తోంది.

ఈ రెండూ ప్రొడక్షన్ దశలో ఉండగానే ఈ సంస్థ మరొక చిత్రాన్ని అనౌన్స్ చేయనుంది. రేపు ఉదయం నటీనటుల వివరాలతో పాటు టైటిల్ లోగోను కూడ విడుదలచేయనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరో నాని కథానాయకుడుగా నటించనున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook