పవన్ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందంటున్న పోసాని..!

Published on Sep 29, 2021 12:04 am IST


మెగా హీరో సాయి తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సీనియర్‌ నటుడు పోసాని కృష్ణమురళీ నిన్న మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ తనకి కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ నేడు మరోసారి హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్‌పై, ఆయన అభిమానులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే ప్రెస్‌క్లబ్‌ వద్దకు పవన్‌ అభిమానులు చేరుకుని పోసానిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోసానిని సురక్షితంగా ఇంటికి పంపించారు. ఈ క్రమంలో పోసాని మాట్లాడుతూ పవన్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉందని, నాకు ఏమైనా అయినా, చనిపోయినా అందుకు పవన్ కళ్యాణే కారణం అవుతారని అన్నారు. అంతేకాదు రేపు పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా పోసాని చెప్పుకొచ్చారు. మరీ ఈ వివాదం పెరిగి పెరిగి ఎక్కడిదాక వెళుతుందోనన్న అంశం ఇటు ఇండస్ట్రీలో, అటు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం :