‘టెంపర్’ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన ‘లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్’ వంటి సినిమాలన్నీ ఆయన అభిమానుల్ని తీవ్రంగా నిరుత్సాహపరిచి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. కానీ ఈసారి ఆయన చేసిన ‘మెహబూబా’ మాత్రం అలా ఉండదట. రేపు 11న విడుదలకాబోతున్న ఈ చిత్రాన్ని ప్రివ్యూల రూపంలో కొందరికి ప్రదర్శించడం జరిగింది.
చూసిన వాళ్లంతా ఈసారి కొత్త పూరిని చూస్తారంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. పైగా పూరి కూడ మొదటి నుండి ఇది తన గత సినిమాల్లా ఉండదని, ఇందులో ప్రేమ కథకు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చానని చెబుతూ వస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో పూరి కొత్తగా ఏం చేశారో చూడాలనే ఆసక్తి నెలకొంది. పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ ప్రేమ కథలో నేహా శెట్టి కథానాయకిగా కనిపించనుంది.
