పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్న ‘జంబ లకిడి పంబ’ !
Published on Jun 12, 2018 9:17 am IST


హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ‘గీతాంజలి, జయంబు నిశ్చయంబురా’ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసి తన అదృష్టాన్ని పరీక్షయించుకోగా ఇప్పుడు ‘జంబ లకిడి పంబ’తో మన ముందుకొస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదలైంది. టీజర్ ను చూస్తే కథ చాలా వరకు ఎంటర్టైన్మెంట్ ధోరణిలోనే ఉంటుందని స్పష్టమవుతోంది.

పైగా శ్రీనివాస్ రెడ్డితో పాటు వెన్నెల కిశోర్, రఘుబాబు, పోసాని, షకలక శంకర్ వంటి స్టార్ కమెడియన్లు ఉండటంతో సినిమా మినిమమ్ గ్యారెంటీ చిత్రంగా అనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జె.బి.మురళి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రవి, జోస్, శ్రీనివాస్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. సిద్ది ఇద్నాని కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను జూన్ 22వ తేదీన విడుదలచేయనున్నారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

  • 4
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook