స్పీడు మీదున్న ‘బాహుబలి’ పోస్ట్ ప్రొడక్షన్

స్పీడు మీదున్న ‘బాహుబలి’ పోస్ట్ ప్రొడక్షన్

Published on Jan 23, 2015 6:00 PM IST

Baahubali
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి’. రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ గురించి తెలిసిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఫస్ట్ పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తయ్యింది. ఇక కొన్ని పాచ్ వర్క్ సీన్స్ మరియు రెండు పాటల షూటింగ్ మాత్రం బాలన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఫేమస్ అయిన చాలా మంది టెక్నీషియన్స్ ఈ సినిమా టెక్నికల్ టీంలో పని చేస్తున్నారు.

టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో, భారీ సెట్స్ మరియు మతిభ్రమించే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇండియా, హాంక్ కాంగ్, యుఎస్ కి చెందినా 6 విఎఫ్ఎక్స్ టీమ్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు