పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆది ‘రఫ్’

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆది ‘రఫ్’

Published on Aug 13, 2014 6:22 PM IST

Rough
యంగ్ హీరో ఆది వరుసగా తన సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. గత వారం విడుదలైన ‘గాలిపటం’ సినిమా యువతని ఆకట్టుకుంటూ అన్ని థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇది కాకుండా ఆది నటించిన లవ్ అండ్ మాస్ ఎంటర్టైనర్ ‘రఫ్’ కూడా త్వరలో రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్దం చెసుకుంటున్నాడు.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆది కూడా ఫస్ట్ హాఫ్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాడు. మరీ కొద్ది రోజుల్లో సెకండాఫ్ కి సంబందించిన డబ్బింగ్ ని కూడా పూర్తి చేయనున్నాడు. ఆది ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. ఆది సిక్స్ ప్యాక్ క్లైమాక్స్ ఫైట్ లో ఉంటాయని సమాచారం.

ఈ మూవీలో ఆది సరసన రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేస్తుండగా, ఓ కీలక పాత్రలో శ్రీ హరి కనిపించనున్నారు. సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అభిలాష్ మాధవరం నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు