మహేష్ బాబుకు ఇలాంటి పోస్టర్ ఒకటి పడాల్సిందే

Published on Oct 8, 2019 8:27 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి కొత్త పోస్టర్ ఒకటి విజయదశమి సందర్బంగా విడుదలైంది. కొండారెడ్డి బురుజు ముందు మహేష్ గొడ్డలి పట్టుకుని నిలబడిన ఈ పోజుకు సూపర్ రెస్పాన్స్ దక్కింది. మహేష్ గత చిత్రాల్ని పరిశీలించినా ఇదే తరహాలో ఏదో ఒక ఆయుధం పట్టుకుని పోరాటానికి సిద్దమైన స్టిల్ కలిగిన పోస్టర్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది.

‘శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి’ ఈ మూడు చిత్రాల్లోనూ ఈ తరహా పొస్టర్ ఉంటుంది. ఆ మూడు సినిమాలు కూడా భారీ హిట్లయ్యాయి. దాన్ని సెంటిమెంట్ గా భావించే ఈ కొత్త సినిమాకి కూడా అలాంటి పోస్టర్నే రిలీజ్ చేసి ఉండొచ్చు టీమ్. పైగా ‘ఒక్కడు’ చిత్రం ద్వారా పాపులర్ అయిన కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్లో పోస్టర్ కావడంతో సినిమాలోని ఆ ఫైట్ సీన్ మీద ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి మొదలైంది.

అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. అంతేకాదు అలనాటి స్టార్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More