“అఖండ” నుంచి పవర్ ఫుల్ నెంబర్ కూడా త్వరలో.!

Published on Sep 20, 2021 1:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘అఖండ’. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మొన్ననే మోస్ట్ ఏవైతే ఫస్ట్ సింగల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఇప్పుడు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుండగా మరోపక్క బాలయ్య అభిమానులు చిన్న నిరాశలో కూడా ఉన్నారు.

అంటే.. ఫస్ట్ సింగిల్ అనగానే మంచి మాస్ అండ్ పవర్ ఫుల్ సాంగ్ కోసం ఎక్కువ మంది ఆశించారు. కానీ దానిని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ టీజ్ చేస్తున్నాడు. ఈసారి అఘోరా లుక్ లో ఉన్న బాలయ్య రోల్ కి చెందిన పవర్ ఫుల్ మాస్ నెంబర్ ని రిలీజ్ చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి వీటికి ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి. పర్టిక్యులర్ గా ఈ సినిమా ఆల్బమ్ పై మాత్రం చాలానే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :